AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రానున్న గంటల్లో హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం..

రానున్న గంటలో ఉత్తర భాగ్యనగరంలో భారీ వర్షం కురవనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. నగరంలోని.. పటాన్‌ చెరు, ఆర్‌సీపురం, హఫీజ్‌పేట్‌, మియాపూర్‌, కూకట్‌పల్లి, కుత్భుల్లాపూర్‌, అల్వాల్‌, బాలనగర్‌, నేరేడ్‌మెట్‌, కంటోన్మెంట్‌, కోంపల్లితో పాటు ధూల్‌పల్లి శివార ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రంలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. వారం పది రోజుల పాటు ఎడతెరిపి లేకుండా రాజధాని హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసాయి. దీంతో.. వరద నీరు పోటెత్తింది. వరదలు పొటెత్తడంతో జలశాయాలు నిండికుండల్లా మారాయి. వరద ప్రభావంతో కొన్ని చోట్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ANN TOP 10