AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

విష్ణువర్ధన్ రెడ్డి అకాల మరణం అత్యంత బాధాకరం

అతి పిన్న వయసులో తండ్రికి తగ్గ తనయుడిగా రాజకీయాల్లో ఎదుగుతున్న గూడెం విష్ణువర్ధన్ రెడ్డి అకాల మరణం అత్యంత బాధాకరమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుమారుని కోల్పోయి తీవ్ర విషాదంలో మునిగిన గూడెం మహిపాల్ రెడ్డి కుటుంబ సభ్యులను ఆదివారం ఆమె పరామర్శించారు. మహిపాల్ రెడ్డి తో పాట ఆమె తల్లి సత్యమ్మ, సతీమణి యాదమ్మ, సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి, చిన్న కుమారుడు గూడెం విక్రమ్ రెడ్డిలు ఉన్నారు. ప్రత్యేకంగా ఎమ్మెల్యే జీఎంఆర్ ను ఆయన తల్లి, సతీమణిని ఆమె ఓదార్చారు. ధైర్యంగా ఉండాలని సూచించారు. దాంతోపాటు జీఎంఆర్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. లక్షల మంది ప్రజలకు నిరంతరం సేవ చేసే ఎమ్మెల్యేకు పుత్రశోకం కలగడం బాధాకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ముఖ్యుల పరామర్శ
జహీరాబాద్ పార్లమెంటు సభ్యుడు బీబీ పాటిల్, ప్రభుత్వ విప్, అచ్చంపేట శాసనసభ్యుడు గువ్వల బాలరాజు, మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ పరామర్శించారు. అనంతరం వారు వేరువేరుగా మాట్లాడుతూ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తనయుడు గూడెం విష్ణువర్ధన్ రెడ్డి అకాల మరణ పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మహిపాల్‌రెడ్డిని పరామర్శించి, ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

ఎంతో భవిష్యత్తు ఉన్న విష్ణు మరణం తమను తీవ్రంగా కలిచి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, జెడ్పీటీసీలు గంగుల సుధాకర్ రెడ్డి, కుమార్ గౌడ్, కార్పొరేటర్ పుష్ప నగేష్, మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య, మాజీ ప్రజాప్రతినిధులు దశరథ్ రెడ్డి, అంతిరెడ్డి, నాయకులు వెంకట్ రెడ్డి, పి.మనోహర్ రెడ్డి, కొమురగూడెం వెంకటేష్, చిన్న మధు తదితరులు పాల్గొన్నారు.

ANN TOP 10