AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఏటీఎంలో రూ.30 లక్షలు చోరీ.. స్కేచ్ మామూలుగా లేదుగా..

ఆధునిక టెక్నాలజీతో ఏటీఎంలో చోరీకి పాల్పడిన ఘటన నల్లగొండ జిల్లాలో జరిగింది. దొంగతనం చేసే సమయంలో ఎవరి కంట పడకుండా ఉండేందుకు కొత్త ఆలోచన చేస్తున్నారు.. తాజాగా జరిగిన ఈ ఘటన ప్రస్తుతం వైరల్‌ గా మారింది. నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం ఐటిపాములలో హైదరాబాద్‌ విజయవాడ జాతీయ రహదారిని ఆనుకుని ప్రజా అవసరాల కోసం ఎస్బీఐ ఏటీఎంను ఏర్పాటు చేసింది. ఈ సెంటర్‌ లో రెండు ఏటీఎం యంత్రాలు ఏర్పాటు చేశారు. అయితే, దొంగలు ఈ ఏటీఎంపై కన్నేశారు. ఇంకేముంది ప్రణాళిక రచించి అమాంతం దోచేశారు.

వ్యాన్‌ లో వచ్చిన ముగ్గురు దుండగులు ముసుగులు ధరించి ఉన్నారు. సరిగ్గా అర్ధరాత్రి ఏటీఎంలోకి ప్రవేశించారు. తమ దొంగతనం సీసీ కెమెరాల్లో రికార్డు కాకుండా ఉండేందుకు దొంగలు ఏటీఎంలోకి రాగానే సీసీ కెమెరాలపై బ్లాక్‌ కలర్‌ స్ప్రే చేశారు. ఏటీఎం అద్దాలను గడ్డపారలతో పగులగోట్టి లోపలికి ప్రవేశించినట్లుగా పోలీసులు గుర్తించారు. గ్యాస్‌ కట్టర్ల సహాయంతో ఏటీఎంను కట్‌ చేసి డబ్బులు చోరీ చేశారు.

అయితే, రెండు ఏటీఎంలో కలిపి 30 లక్షల రూపాయలు చోరీ జరిగినట్లు బ్యాంక్‌ అధికారులు చెబుతున్నారు. బ్యాంకు మేనేజర్‌ వీరబాబు ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సీసీ ఫుటేజ్‌ లను పరిశీలించారు. ఈ చోరీకి ముగ్గురు దుండగులు పాల్పడినట్లు సీసీ కెమెరాలు రికార్డు అయిందని పోలీసులు చెబుతున్నారు.

ANN TOP 10