వెస్ట్ బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య (79) ఆరోగ్యం విషయంగా ఉందని కోల్ కతాలోని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. ఈ రోజు మధ్యాహ్నం శ్వాసకు సంబంధించి ఇబ్బందులు రావడంతో వెంటనే ఆయన్ని సిటీ బేస్డ్ హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం కేర్ ఇంటెన్సివ్ యూనిట్ లో పెట్టి వెంటిలేటర్ మీద చికిత్స చేస్తున్నట్లు హాస్పిటల్ వర్గాలు పేర్కొన్నాయి. హాస్పిటల్ లో బెస్ట్ డాక్టర్స్ కార్డియాలజిస్ట్, పల్మనాలజిస్ట్ లు బుద్ధదేవ్ ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ బెస్ట్ ఇవ్వడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. బుద్ధదేవ్ భట్టాచార్య వెస్ట్ బెంగాల్ సీఎంగా 2000 నుండి 2011వరకు పని చేశారు.









