AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సైనిక విన్యాసాల్లో అపశ్రుతి.. నలుగురు గల్లంతు

ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లో జరుగుతున్న సైనిక విన్యాసాల్లో అపశ్రుతి చోటుచేసుకున్నది. సైనిక విన్యాసాల్లో భాగంగా క్వీన్స్‌లాండ్‌లోని హామిల్టన్ ద్వీపంలో ఓ మిలిటరీ హెలికాప్టర్‌ కుప్పకూలింది. దీంతో అందులో ఉన్న నలుగురు గల్లంతయ్యారు. శుక్రవారం అర్ధరాత్రి ఎంఆర్‌హెచ్‌-90 తైపాన్‌ అనే ఆర్మీ హెలికాప్టర్‌ నీటిలో మునిగిపోయిందని రక్షణ శాఖ మంత్రి రక్షణ శాఖ మంత్రి రిచర్డ్ మార్లెస్ తెలిపారు. నలుగురు సిబ్బంది కనిపించకుండా పోయారని, సమాచారాన్ని వారి కుటుంబ సభ్యులకు అందజేశామని చెప్పారు. గల్లంతైన వారికోసం గాలిస్తున్నామని వెల్లడించారు. రెండు వారాలుగా జరుగుతున్న ఈ సైనిక విన్యాసాల్లో జపాన్, ఫ్రాన్స్, జర్మనీ, దక్షిణ కొరియా కూడా పాల్గొంటున్నాయి. కాగా, చైనా నుంచి ముప్పు పొంచిఉండటంతో ఆస్ట్రేలియా తన సాయుధ బలగాల సామర్థ్యాన్ని పెంచుకుంటున్నది. ఇందులో భాగంగానే తన మిత్ర దేశాలతో కలిసి తరచూ సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నది.

ANN TOP 10