AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పుల్వామా అమరుల కుటుంబాలకు రూ.2. 94 కోట్ల పరిహారం

పుల్వామా దాడిలో అమరులైన జవాన్ల కుటుంబ సభ్యులకు స్థాయిని బట్టి రూ. 1.56 కోట్ల నుంచి 2.94 కోట్ల పరిహారం అందజేశామని కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ బుధవారం పార్లమెంట్‌లో వెల్లడించారు. 2019 లో పుల్వామా వద్ద జరిగిన దాడిలో 40 మంది సిఆర్‌పిఎఫ్ జవాన్లు మరణించారు. వారి కుటుంబ సభ్యులకు ఇచ్చిన ఉద్యోగాలు ప్రస్తుత స్థితి వివరాల జాబితాను కేంద్ర మంత్రి సభకు తెలిపారు. జవాన్ల కుటుంబాలకు పరిహారంతోపాటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామన్నారు. వ్యక్తులు, కార్పొరేట్ సంస్థలు పెద్ద మనసుతో ఇచ్చిన విరాళాలను సైతం అందజేశామని చెప్పారు. సైనికుల కుటుంబీకులకు వివిధ విభాగాల్లో ఉద్యోగాలు కల్పించామని రాయ్ పేర్కొన్నారు.

ANN TOP 10