ఆదిలాబాద్: జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల వల్ల ముంపునకు గురైన ప్రాంతాలలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస రెడ్డి పర్యటించారు. జైనథ్ మండలంలోని పలు గ్రామాలను సందర్శించారు. వరదధాటికి దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించారు. కంది శ్రీనివాస రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముంపు బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఇళ్లు , పంటపొలాల్లోకి నీళ్లు చేరి నష్టపోయిన బాధితులను కలిసి పరామర్శించారు. వర్షాల ధాటికి దెబ్బతిన్న రోడ్లను, తడిచిన ధాన్యాన్ని పంటపొలాలలను పరిశీలించారు. బాధితులకు భరోసా నిచ్చారు.









