AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కంది శ్రీనన్న సమక్షంలో భారీ చేరికలు

జోగురామన్న అవినీతిని ఎండగట్టిన కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి
పార్టీ గెలుపుకోసం కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపు
ఆదిలాబాద్‌: పట్టణంలోని కంది శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజా సేవాభవన్‌ నిత్యం ప్రజలు, అభిమానులు, కాంగ్రెస్‌ కార్యకర్తల రాకతో సందడిగా మారుతోంది. కంది శ్రీనివాస రెడ్డి చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు, నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం ఎమ్మెల్యే జోగు రామన్నను ప్రశ్నిస్తున్న తీరు ఆదిలాబాద్‌ అభివృద్ధి నిరంతరం ఆయన పడుతున్న తపన చూసి జనం మేము సైతం నీవెంటే అంటూ తరలివస్తున్నారు. ఆదిలాబాద్‌ పట్టణంతో పాటు నియోజకవర్గంలోని గ్రామాల నుంచి ప్రతీ రోజు ప్రజా సేవాభవన్‌ కు తరలివస్తున్నారు. ముంపు గ్రామాల పర్యటనలో కంది శ్రీనివాస రెడ్డి బిజీ గా ఉన్నా ఆయన వచ్చేవరకు వేచి ఉండి కంది శ్రీనన్న సమక్షంలో కాంగ్రెస్‌ లో చేరుతున్నారు.

కాంగ్రెస్‌ నాయకులు మొహమ్మద్‌ షోయబ్‌, మొహమ్మద్‌ వసీమ్‌ రంజాని ఆధ్వర్యంలో 28వ వార్డు లోని కోలిపూర కాలనీ వాసులు మొహమ్మద్‌ జుబేర్‌, మొహమ్మద్‌ జునైద్‌, మొహమ్మద్‌ సోహెల్‌, షేక్‌ జావీద్‌, షేక్‌ ఇర్ఫాన్‌ లతో పాటు పెద్ద సంఖ్యలో ముస్లిం మైనారిటీ మహిళలు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వారందరికి కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు కంది శ్రీనివాస రెడ్డి. అనంతరం ఎమ్మెల్యే జోగురామన్న వైఫల్యాలను ఎండ గట్టారు. అన్ని చేతకాని హామీలిచ్చి ప్రజలను మోసం చేశాడని ఆరోపించారు. లక్ష రూపాయల రుణమాఫీ, ఫించన్లు, కొత్త రేషన్‌ కార్డులు, లోన్లు , నిరుద్యోగులకు భృతి లాంటివేవి కల్పించ లేదని అన్నారు.

తన సొంత ఆస్తులు కూడ బెట్టుకున్నాడే తప్ప ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకొస్తే రైతు డిక్లరేషన్‌ యూత్‌ డిక్లరేషన్‌ లతోపాటు నిరుద్యోగ భృతి, రెండు లక్షల రుణమాఫీ, ఇల్లు కట్టుకోవడానికి రూ.5లక్షల సాయం, అవ్వతాతలకు నాలుగు వేల చొప్పున పింఛన్‌, రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌ లాంటి అన్ని గ్యారెంటీి హామీలను నెరవేస్తుందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ గెలుపు కోసం కార్యకర్తలంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గీమ్మ సంతోష్‌, షకీల్‌, రమేష్‌, ప్రభాకర్‌, రామ్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ANN TOP 10