ఓ కామాంధుడి వేధింపులు తట్టుకోలేక ఓ వివాహిత ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదకర ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు గ్రామానికి చెందిన పస్తం శ్రీనుకు 2006లో మంజుల (34)తో పెళ్లి జరిగింది. ఉపాధి నిమిత్తం 10 సంవత్సరాల క్రితం ముంబై వెళ్లిన దంపతులు.. మూడు నెలల క్రితం తెలంగాణకు తిరిగి వచ్చారు. వర్ధన్నపేటలో జాటోత్ జితేందర్ అనే వ్యక్తి ఇంట్లో అద్దెకు దిగారు.
అక్కడ ఆమెపై లైంగిక దాడికి యత్నించడంతో అతడి బారినుంచి తప్పించుకున్న మంజుల ఎలుకల మందు తాగింది. కుటుంబసభ్యులు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ జులై 24న ఆమె మృతి చెందింది. ఈ ఘటనలో లైంగిక వేధింపులు తట్టుకోలేక తన భార్య మంజుల ఆత్మహత్యకు పాల్పడిందని భర్త శ్రీను పోలీసులకు ఫిర్యాదు చేశారు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.









