AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మహిళపై జవాన్ దారుణం.. షాకింగ్ వీడియో వైరల్

జాతుల మధ్య వైరుధ్యంతో అట్టుడుకుతోన్న మణిపూర్‌లో మహిళలపై అల్లరి మూకలు అఘాయిత్యాలకు తెగబడిన ఘటనలు, అమానుష చర్యలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా, ఒక కిరాణా దుకాణంలో ఓ మహిళపై బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ జవాన్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన వెలుగుచూసింది. దుకాణంలోని సీసీటీవీలో ఇదంతా రికార్డు కావడంతో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం కావడంతో లైంగిక వేధింపులకు పాల్పడిన జవాన్‌పై బీఎస్‌ఎఫ్ అధికారులు చర్యలు చేపట్టారు. అతడ్ని సస్పెండ్ చేసి, విచారణకు ఆదేశించారు.

అల్లర్లను అరికట్టేందుకు వచ్చిన బీఎస్‌ఎఫ్‌ జవానే ఓ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. జులై 20న ఇంఫాల్‌లోని ఓ కిరాణా స్టోర్‌కు వచ్చిన మహిళపై అక్కడ విధులు నిర్వర్తిస్తున్న సరిహద్దు భద్రతా దళం జవాను అనుచితంగా ప్రవర్తించాడు. స్టోర్‌లో ఆమె ఒంటరిగా ఉండటం చూసి ఆమెను అనుసరించాడు. అసభ్యంగా తాకుతూ వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంభందించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వైరల్‌ అయిన దృశ్యాల ఆధారంగా ఆ జవానును గుర్తించి సస్పెండ్‌ చేసినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. రాష్ట్ర పోలీసుల నుంచి ఫిర్యాదు అందుకున్న బీఎస్‌ఎఫ్ నిందితుడిపై అంతర్గత దర్యాప్తు చేపట్టినట్లు తెలిపింది.

ANN TOP 10