AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నిండుకుండలా హుస్సేన్‌సాగర్

హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. భాగ్యనగరంలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో ఎగువ ప్రాంతాల నుంచి హుస్సేన్ సాగర్‌కు వరద పోటెత్తుతోంది. బంజారా, పికెట్, కూకట్‌పల్లి నాలాల నుంచి హుస్సేన్‌సాగర్‌లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో హుస్సేన్‌సాగర్‌ నీటిమట్టం ఫుల్ ట్యాంక్ లెవల్‌ను దాటేసింది. హుస్సెన్‌సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ 513.41 మీటర్లు కాగా.. ప్రస్తుతం అంతేలా అంటే 513.47 మీటర్లుగా నీటి మట్టం కొనసాగుతోంది. నీటిమట్టం ఫుల్‌ట్యాంక్ లెవల్ దాటంతో అధికారులు తూముల ద్వారా హుస్సేన్‌సాగర్ నుంచి నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు. దీంతో మూసి పరివాహక ప్రాంత ప్రజలను జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు.

ANN TOP 10