AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పాపం చిట్టితల్లీ.. మూడేళ్లకే నూరేళ్లు నిండాయి

ట్రైన్ కింద పడి మూడేళ్ల చిన్నారి మృతి
మహబూబ్‌నగర్ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ట్రైన్ కింద పడి మూడేళ్ల చిన్నారి మృతి చెందింది. ట్రైన్ ఎక్కే సమయంలో ప్రమాదవశాత్తు జారిపడి ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా వెంకట్‌రెడ్డిపల్లికి చెందిన చంద్రారెడ్డికి ముగ్గురు కూతుళ్లు. చిన్న కుమార్తె శ్రీ లక్ష్మి మహమ్మదాబాద్ ఎంజల్ వ్యాలీ స్కూల్‌లో నర్సరీ చదువుతోంది.

అయితే ఆదివారం హైదరాబాద్‌లో ఉంటున్న తన అన్నయ్య ఇంటికి చంద్రారెడ్డి దంపతులు పిల్లలతో సహా బయల్దేరారు. హైదరాబాద్ చేరుకోగానే.. రైలు నుంచి దిగే క్రమంలో చిన్నారి శ్రీలక్ష్మి ప్రమాదవశాత్తు జారి ట్రైన్ కింద పడిపోయింది. ట్రైన్ చిన్నారి పైనుంచి వెళ్లటంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. దీంతో చిన్నారి కుటుంబంతో పాటు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ANN TOP 10