AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

‘శ్రీరాంసాగర్‌’కు జలకళ

ఉత్తర తెలంగాణకు వరప్రదాయిని అయిన శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు జలకళ సంతరించుకోవడంతో జిల్లా రైతాంగంలో సాగుపై ఆశలు చిగురిస్తున్నాయి. వారం రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రాజెక్టులోకి పెద్ద ఎత్తున వరద నీరు వస్తున్నది. సోమవారం రాత్రి 63 టీఎంసీల నీటి మట్టానికి చేరుకున్నది. ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలతో వరద వస్తున్నది. గడిచిన నాలుగు రోజుల్లో ప్రాజెక్టులోకి 22 టీఎంసీలకు పైగా నీళ్లు వచ్చాయి. సోమవారం సాయంత్రం వరకు 19,722 క్యూసెక్కుల వరద నీరు వస్తున్నది. ఎగువ ప్రాంతంలో ఇంకా భారీ వర్షాలు కురిస్తే మాత్రం వారం రోజుల్లో ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 90 టీఎంసీలకు చేరుకోనున్నది. దీంతో వానాకాలం సీజన్‌ పంటకే గాకుండా యాసంగి పంటలకు కూడా సాగు నీటికి ఢోకా ఉండదు.

ANN TOP 10