AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

‘భోళా శంకర్‌’ కోసం… కుర్ర హీరోగా..

చిరంజీవికి సినిమాలేం కొత్త కాదు.. ఇప్పటికే 150 చేసేశారు.. కానీ ఇప్పుడు సినిమాల కంటే మరో విషయంపైనే ఎక్కువగా ఫోకస్‌ చేస్తున్నారు మెగాస్టార్‌. ప్రతీ సినిమాలోనూ దాని కోసమే ఎక్కువగా టైమ్‌ కేటాయిస్తున్నారు. ఫ్యాన్స్‌తో పాటు అందర్నీ ప్రతీసారి ఆ ఒక్క విషయంలో మాత్రం మెస్మరైజ్‌ చేస్తూనే ఉన్నారు చిరు. తాజాగా భోళా శంకర్‌ కూడా దీనికి మినహాయింపు కాదు. ఇంతకీ ఏంటా విషయం..?

భోళా శంకర్‌ సినిమా కోసం చిరంజీవి 20 ఏళ్లు తగ్గించుకోవాల్సి వచ్చిందంట.. గతేడాది ఆచార్య, గాడ్‌ ఫాదర్‌లో కాస్త బరువు పెరిగినట్లు కనిపించిన చిరు.. వాల్తేరు వీరయ్యతో మళ్లీ సెట్‌ అయిపోయారు. ఇప్పుడు భోళా శంకర్‌లో అయితే మరింత సన్నగా మారిపోయారు. యంగ్‌ హీరోగా మారారట. ఆయన గ్లామర్‌ రోజురోజుకీ పెరుగుతుందే తప్ప తగ్గట్లేదు. ప్రస్తుతం ఫారిన్‌ ట్రిప్‌లో ఉన్న చిరంజీవి.. రాగానే కల్యాణ్‌ కృష్ణ సినిమా మొదలు పెట్టనున్నారు. దాని తర్వాత వశిష్ట సినిమా లైన్‌లో ఉంది.

ఓ పర్టిక్యులర్‌ ఏజ్‌ వచ్చిన తర్వాత ఎంత బాగా కనిపించాలనుకున్నా ఎక్కడో ఓ చోట తేడా అయితే కొడుతుంది. కానీ ఈ విషయంలో చిరు మాత్రం అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. పాలిటిక్స్‌లోకి వెళ్లిన తర్వాత చిరుకు వయసైపోయిందనుకున్నారు. కానీ రీ ఎంట్రీ ఇవ్వాలని ఫిక్సయ్యాక.. బరువు తగ్గి చాలా మారిపోయారు మెగాస్టార్‌. అప్పట్నుంచి సినిమా సినిమాకు మరింత యంగ్‌ అవుతూనే ఉన్నారు.

ANN TOP 10