AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఇదేంటీ.. గడ్డి, ఆకులు తింటున్న సింహం.. వీడియో వైరల్‌

సింహం ఆహారం గురించి అందరికీ తెలిసిందే. సింహాలు ఇతర జంతువులను వేటాడి తమను తాము పోషించుకుంటాయి. కానీ, సింహాలు మాంసాన్నే కాదు గడ్డి, ఆకులను కూడా తింటాయని మీకు తెలుసా…? అవును మీరు విన్నది నిజమే.. ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ.. ఇక్కడ ఓ సింహం పచ్చటి ఆకుల్ని తింటున్న వీడియో ఇప్పుడు కెమెరాకు చిక్కింది. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది. అరుదుగా సింహాలు ఇలాంటి ఆకులను తింటాయి. దానికి కారణం ఉంది. అదేంటో ఇక్కడ తెలుసుకుందాం..

వన్యప్రాణులు సహజంగానే మనకు ఆసక్తిని కలిగిస్తాయి. ఇక్కడ కనిపించే అరుదైన దృశ్యాలు మనల్ని విస్మయానికి గురిచేస్తాయి. ఇది కూడా అలాంటి సన్నివేశమే. IFS అధికారి షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు చాలా వీక్షణలను సంపాదించుకుంది. వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నందా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఇక్కడ సింహం గొర్రెలు, మేకల మాదిరిగా ఆకులను తింటూ కనిపించింది. సింహం ఇలా ఆకులను తింటే సహజంగానే కుతూహలం కలుగుతుంది. ఎందుకు అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.

ANN TOP 10