ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో మంగళవారం షెడ్యూల్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వర్గాలకు చెందిన కొంతమంది పురుషులు నగ్నంగా నిరసన తెలిపారు. నకిలీ కుల ధ్రువీకరణ పత్రాలు ఉపయోగించి ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నిరసనలకు సంబంధించిన చిత్రాలు, వీడియోలు ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమయ్యాయి.
యువకులు నగ్నంగా రాష్ట్ర శాసనసభ వైపు కవాతు చేస్తున్నప్పుడు పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారని అధికారులు తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీ నాలుగు రోజుల వర్షాకాల సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. నకిలీ కుల ధృవీకరణ పత్రాలతో ఉద్యోగాలు పొందిన వారిపై చర్యలు తీసుకోవాలన్న సందేశాలున్న ప్లకార్డులు పట్టుకుని రాష్ట్ర అసెంబ్లీ భవనం వైపు ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శన చేసినందుకు పాండ్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని అమ సియోని మలుపు దగ్గర ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నట్టు రాయ్‌పూర్ సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ ప్రశాంత్ అగర్వాల్ తెలిపారు.









