AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వరదలో కొట్టుకొచ్చిన పాల ప్యాకెట్లు.. ఎగబడిన జనం.. వీడియో వైరల్

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా ఆంధ్రప్రదేశ్ లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీర ప్రాంతాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. మచిలీపట్నంలో గురువారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై మోకాళ్ల లోతు వరద చేరింది. ఆ వరదలో పాలప్యాకెట్లు కొట్టుకు రావడంతో మొదట ఆశ్చర్య పోయిన జనం.. తేరుకుని వాటిని ఏరుకునేందుకు ఎగబడ్డారు.

మోకాళ్ల లోతు నీటిలో పాల ప్యాకెట్లను ఏరుకుంటున్న జనాలను కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ఈ వీడియో కాస్తా ఇప్పుడు వైరల్ గా మారింది. వరద నీళ్లలో పాల ప్యాకెట్లు కొట్టుకురావడమేంటని ఆరాతీయగా.. సాయిబాబా ఆలయం జంక్షన్‌లో మోకాలిలోతు నీరు నిలిచింది. ఆ వరదలోనే అటుగా వెళ్తున్న ఓ వాహనం నుంచి పాల ప్యాకెట్ల ట్రేలు కిందపడ్డాయి. దీంతో పాల ప్యాకెట్లు కొట్టుకొచ్చాయని, నీళ్లలో దిగి స్థానికులు వాటిని ఏరుకున్నారని తేలింది. కాగా, రెండు రోజులుగా ఏపీలోని తీర ప్రాంతాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. మరో రెండు రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ పేర్కొంది.

ANN TOP 10