AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణ విద్యాశాఖ సరికొత్త నిర్ణయం..! డిజిటల్ స్క్రీన్లపై మ్యాథ్స్, సైన్స్ పాఠాలు..!

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులలో గణితం, సైన్స్ సబ్జెక్టులపై అవగాహనను పెంపొందించడానికి ఖాన్ అకాడమీ పర్సనలైజ్డ్ అడాప్టివ్ లెర్నింగ్ విధానాన్ని 2026-27 విద్యా సంవత్సరంలో సమర్థవంతంగా అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశాలు జారీ చేశారు.

 

డిజిటల్ క్లాస్‌రూమ్‌లు..

6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులందరికీ ఈ డిజిటల్ బోధన వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమం కింద అన్ని ప్రభుత్వ, జెడ్పీహెచ్ఎస్, మోడల్ స్కూల్స్, కేజీబీవీలలో డిజిటల్ క్లాస్‌రూమ్‌లను ఏర్పాటు చేయనున్నారు. వారానికి ఒక గణితం, ఒక సైన్స్ పీరియడ్ చొప్పున ఐఎఫ్‌పీ స్క్రీన్లు లేదా ప్రాజెక్టర్ల ద్వారా ఖాన్ అకాడమీ రికార్డెడ్ పాఠాలను విద్యార్థులకు ప్రదర్శించాలని సూచించారు. పాఠశాల సమయం తర్వాత లేదా ఇంట్లో స్మార్ట్‌ఫోన్ల ద్వారా విద్యార్థులు ఆన్‌లైన్ ప్రాక్టీస్ పూర్తి చేసేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పర్యవేక్షించాల్సి ఉంటుందని స్పష్టంచేశారు.

 

15 రోజులకు ఒకసారి..

ఉపాధ్యాయుల పాఠాల ప్రిపరేషన్, విద్యార్థుల ప్రగతిని ట్రాక్ చేయడానికి ఖాన్మిగో ఏఐ టూల్ ను అందుబాటులో ఉంటుందన్నారు. ఈ విద్యా విధానంపై హెడ్‌మాస్టర్లు వారానికోసారి, మండల విద్యాధికారులు 15 రోజులకు ఒకసారి, జిల్లా విద్యాధికారులు లేదా కలెక్టర్లు నెలవారీ సమీక్షలు నిర్వహించి నివేదికలను పరిశీలిస్తారని స్పష్టంచేశారు. రెండు వారాల కంటే ఎక్కువ కాలం ఇనాక్టివ్‌గా ఉన్న పాఠశాలలపై ప్రత్యేక శ్రద్ధ వహించి తగిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ స్పష్టం చేసింది.

ANN TOP 10