AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మంత్రి హరీశ్ రావుతో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ భేటీ

రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌
మంత్రి హరీష్ రావును గోషామహాల్ ఎమ్మెల్యే రాజసింగ్ కలిశారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధుల కోసమే హరీష్ రావును కలిశానని రాజాసింగ్ చెబుతున్నారు. మొత్తానికి వీరిద్దరి భేటీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రాజాసింగ్ పై బీజేపీ పార్టీ విధించిన సస్పెన్షన్ ఇంకా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ, పార్టీతో ఆయనకు సంబంధం లేకుండా పోయింది. రాజాసింగ్ పై సస్పెన్షన్ ను ఎత్తివేయాలని హైకమాండ్ కు బండి సంజయ్ పలు మార్లు లేఖలు రాసినా పార్టీ పెద్దల నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

మరోపక్క, ఇటీవలే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించిన కిషన్ రెడ్డితో రాజాసింగ్ కు విభేదాలు ఉన్నాయని కూడా చెపుతున్నారు. ఈ నేపథ్యంలో హరీశ్ తో రాజాసింగ్ భేటీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు కేవలం తన నియోజకవర్గ అభివృద్ధి కోసమే హరీశ్ రావును కలిశానని రాజాసింగ్ చెప్పారు. ఇతర విషయాల గురించి తాము చర్చించలేదని అన్నారు.

గతంలో రాజాసింగ్‌ను తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ కలిశారు. టీడీపీలో చేరాల్సిందిగా ఆయనను ఆహ్వానించారు. గతంలో టీడీపీ నుంచి రాజాసింగ్ కార్పొరేటర్‌గా పనిచేశారు. దీంతో టీడీపీలో చేరతారనే వార్తలు కూడా మీడియాలో వచ్చాయి. కానీ తనకు టీడీపీలో చేరే ఉద్దేశం లేదని స్పష్టతిస్తూ రాజాసింగ్ సోషల్ మీడియా ఒక వీడియో విడుదల చేశారు. దీంతో సైకిలెక్కుతారనే వార్తలకు చెక్ పడింది. ఈ నేపథ్యంలో హరీష్ రావును కలవడంతో రాజాసింగ్ బీఆర్ఎస్‌లో చేరతానే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ANN TOP 10