AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

భాగ్యనగరంలో బీజేపీ నాయకుడు కిడ్నాప్..

బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారి ముక్కెర తిరుపతిరెడ్డి కిడ్నాప్‌కు గురయ్యాడు.. హైదరాబాద్‌లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కిడ్నాప్ జరిగినట్లు భావిస్తున్నారు.. తిరుపతిరెడ్డి భార్య సుజాత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం దుబ్బకుంటపల్లి గ్రామానికి చెందిన ముక్కెర తిరుపతిరెడ్డి ప్రస్తుతం బీజేపీ లో యాక్టివ్ రోల్ పోషిస్తున్నాడు..

జనగామ టిక్కెట్ రేసులో వున్నాడు. వృత్తి రీత్యా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న తిరుపతిరెడ్డి హైదరాబాద్‌లోని కుషాయిగూడలో కుటుంబంతో స్థిరపడ్డాడు. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో అల్వాల్ తహసీల్దార్ కార్యాలయం సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని కిడ్నాప్ చేశారని తిరుపతిరెడ్డి భార్య సుజాత పోలీసులకు ఫిర్యాదు చేశారు.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ANN TOP 10