AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పుడితే గొప్ప ఇంట్లో పుట్టాలి.. ఇలా బతకడం ఇష్టం లేదంటూ.. బాలుడు..

రాజన్న సిరిసిల్ల : అమ్మ కొట్టిందని ఓ బాలుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కోనరావుపేట మండలం కమ్మరి పేట తండాలో తీవ్ర కలకలం రేపింది. కారణమేంటో తెలియదు కానీ దినేష్ అనే బాలుడిని అతని తల్లి జ్యోతి కొట్టిందట. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన దినేష్.. తన స్నేహితులకు ఒక వీడియో మెసేజ్ పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడట.

‘పుడితే గొప్ప ఇంట్లో పుట్టాలి.. ఇలా బతకడం ఇష్టం అనిపించడం లేదు’ అని దినేష్ తన స్నేహితులకు వీడియో సందేశం పంపాడట. ఆపై దగ్గరిలోని అటవీ ప్రాంతానికి వెళ్లి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి కేసు నమోదు చేసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. కుమారుడి మరణంతో భూక్యా రాజు, జ్యోతి దంపతుల రోదనలు ఆపడం ఎవరితరమూ కావడంలేదు.

ANN TOP 10