AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పార్టీలోనే దొంగలు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

కొంత కాలంగా అధికార పార్టీ నేతలు వరుసగా తమ అసంతృప్తిని బహిరంగంగానే వెల్లగక్కుతున్నారు. ఇటీవలే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఆ తర్వాత మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తమ అసంతృప్తిని వెల్లగక్కి.. ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరిపోయారు కూడా. ఇక ఇప్పుడు మరో గళం కూడా బయటికి వచ్చింది. అది ఎవరిదో కాదు.. చాలా రోజులుగా తన పౌరసత్వంపై వివాదాలు ఎదుర్కొంటున్న వేములావాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు. 24 గంటల కరెంట్ విషయంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వాఖ్యల పట్ల బీర్ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో వేములవాడలో నిర్వహించిన ధర్నాలో రమేష్ బాబు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే రమేష్ బాబు హాట్ కామెంట్స్ చేశారు.

బీఆర్ఎస్ పార్టీలోనే దొంగలు ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో తనను పక్కన పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. తాను నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, తనకు పదవిపై ఎలాంటి వ్యామోహం లేదన్నారు. అభిమానం ప్రజల గుండెల్లో ఉండాలని, ఫ్లెక్సీలలో కాదని చురకలు అంటించారు. భూములు కబ్జా చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోను వదిలేది లేదన్నారు. నియోజకవర్గ ప్రజలు మళ్లీ తననే ఆదరిస్తారనే నమ్మకం ఉందన్నారు.

ANN TOP 10