AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ లలిత కుమారి బదిలీ

తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలిత కుమారి బదిలీ అయ్యారు. ఆమెను కర్ణాటక హైకోర్టుకు బదిలీ చేశారు. దీనికి సంబంధించిన సంబంధించి సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసులను కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. బదిలీ ఉత్త ర్వులను జారీ చేసింది. జస్టిస్ కన్నెగంటి లలిత కుమారితో పాటు మరో ఇద్దరు వేర్వేరు రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తుల బదిలీలను కూడా కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. గతంలో ఆమె ఏపీ హైకోర్టులో పని చేశారు. అనంతరం తెలంగాణ హైకోర్టుకు బదిలీ అయ్యారు.

ANN TOP 10