నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి చెప్పనక్కర్లేదు. ఎక్కడికి వెళ్లినా అభిమానులు ఆయన్ను కలిసేందుకు ఎగబడుతుంటారు. బాలయ్య ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న తానా సంబరాల్లో ఉన్నారు. అయితే నందమూరి హీరో సతీమణి వసుంధరతో కలిసి తన లేడీ ఫ్యాన్ పుట్టిన రోజు వేడుకల్లో సందడి చేశారు. తన పుట్టిన రోజు అని చెప్పగానే ఆమెతో కేక్ కటింగ్ దగ్గరుండి చేయించారు.. అనంతరం ఆమెను ఆశీర్వదించారు. ఆ యువతికి జీవితాంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకాన్ని అందించారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.









