తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లండన్ పర్యటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అక్కడి ప్రముఖ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి బృంధం భేటి అయ్యింది. తెలంగాణలో విద్యా, పరిశోధన రంగాల్లో భాగస్వామ్య అవకాశాలపై ఈ భేటిలో విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్‌బాబు, సీఎం సలహాదారు, ఎక్స్‌అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్ పాల్గొన్నారు.
ప్రపంచంలోని అత్యుత్తమ విద్యా సంస్థలకు హైదరాబాద్‌లో ఉన్న అవకాశాలను సీఎం రేవంత్ రెడ్డి కేంబ్రిడ్జ్ ప్రతినిధులకు వివరించారు. హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఇందులో భాగస్వాములు కావాలని ఆహ్వానించారు. సీఎం రేవంత్ పిలుపుపై కేంబ్రిడ్జ్ బిజినెస్ ప్రతినిధి బృందం సుముఖత వ్యక్తం చేసింది. కేంబ్రిడ్జ్ మార్కెటింగ్ ప్రొఫెసర్ జైదీప్ ప్రభు, ప్రొఫెసర్ వెంకట శిరీష్ తెలంగాణతో కలిసి పనిచేసేందుకు ఆసక్తికనబరిచారు. తెలంగాణలో ఉన్న అవకాశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని సీఎంకు హామీ ఇచ్చారు. మధ్య కీలక అంగీకారం కుదిరింది. హైదరాబాద్‌లో విద్యా కార్యక్రమాలు నిర్వహించడం, సంయుక్తంగా పరిశోధనలు చేపట్టడం, యువ పారిశ్రామికవేత్తలకు అవసరమైన ఇంక్యుబేషన్, స్టార్టప్‌ల అభివృద్ధికి సహకరించడం వంటి అంశాల్లో భాగస్వామ్యానికి ఒక స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని ఇరు వర్గాలు నిర్ణయించాయి. హైదరాబాద్‌ను అంతర్జాతీయ విద్యా, పరిశోధన, ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దాలన్న ‘తెలంగాణ రైజింగ్’ లక్ష్యానికి ఈ సమావేశం మరింత బలం చేకూరుస్తుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.







