ఏపీ నిరుద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. 10,060 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిది. 2026 జాబ్ క్యాలెండర్‌లో నాలుగు దశల్లో 10,060 పోస్టుల భర్తీ చేస్తామని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. తొలి దశలో 1,523 పోస్టులు ఇప్పటికే నోటిఫై చేసామని, సెప్టెంబర్ 15న రెండో దశలో 3,231 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని సర్కర్ పేర్కోంది.
రెండో దశలో గ్రూప్-1లో 149 పోస్టులు. పోలీస్ విభాగంలో భారీగా ఉద్యోగాలు నింపుతామని సర్కార్ తెలిపింది. రెండో దశలో పోలీస్ కానిస్టేబుల్ 542. సివిల్ ఎస్‌ఐ 182 పోస్టులు అక్టోబర్ 15న మూడో దశలో 2,311 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని సర్కార్ తెలిపింది.
మూడో దశలో గ్రూప్-2లో 673 పోస్టులు. డిప్యూటీ తహసీల్దార్ 200 పోస్టులు, మూడో దశలో ఇంజినీరింగ్ సహా ఇతర విభాగాల్లో 1,638 పోస్టుల భర్తీచేస్తామని తెపారు. అక్టోబర్ 15న నాలుగో దశలో 2,995 పోస్టులు. స్కూల్ ఎడ్యుకేషన్‌లోనే 2,991 పోస్టులు భర్తీ చేస్తామని కూటమి సర్కార్ తెలిపింది.







