AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ప్రధాని పర్యటనను బహిష్కరిస్తున్నాం: మంత్రి కేటీఆర్‌

ప్రధాని మోడీ ఏ మొహం పెట్టుకొని తెలంగాణకు వస్తున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెలంగాణపై వ్యతిరేకతను నరనరాన జీర్ణించుకున్నారని విమర్శించారు. హైదరాబాద్‌ తెలంగాణ భవన్‌లో మంత్రులు జగదీశ్‌ రెడ్డి, సత్యవతి రాథోడ్‌తో కలిసి మంత్రి కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు. విభజన హామీలను ప్రధాని మోడీ ఒక్కటి కూడా నెరవేర్చలేదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. గుజరాత్‌కు రూ.20 వేల కోట్లతో కోచ్‌ ఫ్యాక్టరీ ఇచ్చారని, తెలంగాణకు కేవలం రూ.521 కోట్ల నిధులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ పట్ల ప్రధాని మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. రేపటి మోడీ పర్యటనను తామంతా బహిష్కరిస్తున్నామని చెప్పారు. గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ హామీ ఏమైందని నిలదీశారు.

ANN TOP 10