AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సాయిచంద్ భార్యకు పదవి.. కోటిన్నర ఆర్థిక సాయం

సాయిచంద్‌ కుటుంబానికి మంత్రి కేటీఆర్ కోటిన్నర రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. గత నెలలో గుండెపోటుతో మరణించిన ములుగు జడ్పీ జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీష్ కుటుంబానికి కూడా కోటిన్నర ఆర్థిక సాయం చేయనున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలిపారు. ఈ మొత్తాన్ని తమ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల ఒక నెల వేతనం నుంచి సమకూరుస్తున్నట్లు కేటీఆర్ వెల్లడించారు.

కుసుమ జగదీష్‌కు ముగ్గురు పిల్లలు కాగా.. ఒక్కొక్కరి పేరిట రూ.25 లక్షల చొప్పున ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తామని కేటీఆర్ తెలిపారు. వృద్ధులైన జగదీశ్ తల్లిదండ్రుల పేరిట రూ.25 లక్షలు డిపాజిట్ చేస్తామన్నారు. సాయిచంద్ తల్లిదండ్రుల పేరిట రూ.25 లక్షలు, చెల్లెలి పేరిట రూ.25 లక్షలు జమ చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వెల్లడించారు. తమ పార్టీ అంతా ఓ కుటుంబం లాంటిందన్న కేటీఆర్.. ఎవరికైనా ఆపద వస్తే.. తామంతా అండగా ఉంటామని.. కలిసి ఆదుకుంటామని సందేశం ఇవ్వడానికే.. తాము ఇలా చేస్తున్నామని తెలిపారు.

జానపద గాయకుడైన సాయిచంద్.. డ్యాన్సర్ అయిన రజినీని ప్రేమించి పెళ్లాడారు. తెలంగాణ ఉద్యమ వేదికపై సాయిచంద్ గాత్రంతో ప్రజలను ఉత్తేజపరిస్తే.. అదే వేదికపై రజిని గజ్జె కట్టి నాట్యం చేసేది. ఆయన పాట, ఆమె ఆట కలిసి.. వారి మధ్య ప్రేమ చిగురించింది. పెద్దల అంగీకారంతో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.

ANN TOP 10