AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

హైదరాబాద్: తెలంగాణ ఇంటర్ మీడియట్ సప్లిమెంటరీ ఫలితాలను శుక్రవారం విడుదల చేశారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ సప్లిమెంటరీ ఫలితాలను విడుదల చేశారు. జూన్ 12 నుంచి 20 మధ్యల జరిగిన ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్‌కు దాదాపుగా 2.7 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.

ఫలితాలను విద్యార్థులు ఇంటర్‌ బోర్డ్‌ అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు చెక్‌ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లీ పరీక్షలను జూన్‌ 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించిన విషయం విధితమే. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 933 పరీక్షాకేంద్రాల్లో సప్లీమెంటరీ పరీక్షలను నిర్వహించారు. ఫస్ట్ ఇయర్‌, సెకండ్‌ ఇయర్‌లో కలిపి మొత్తం 4,12,325 మంది పరీక్షకు హాజరయ్యారు. అలాగే ప్రాక్టికల్స్‌ను జూన్‌ 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు నిర్వహించారు.

ANN TOP 10