నేను వంగవీటి రంగా శిష్యుడిని అని రాష్ట్ర హౌసింగ్ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు , వంగవీటి రంగా ప్రజా నాయకుడు అని అయన ఒక కులానికో మతానికో చెందిన వ్యక్తి కాదు అని జోగి రమేష్ అన్నారు, ఎక్కడ ఉన్నా అనుక్షణం పేద ప్రజల అభివృద్ధి కోసం పని చేసిన వ్యక్తి వంగవీటి రంగా అని జోగి రమేష్ అన్నారు.
అమరావతి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో వంగవీటి మోహన రంగా 76వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి జోగి రమేష్ సహా పలువురు ప్రజా ప్రతినిధుల హాజరయ్యారు. రంగా వెన్నులో దిగిన కత్తి.. ఆయనపై విసిరిన బాంబు టీడీపీది కాదా అని ప్రశ్నించారు, పవన్ కళ్యాణ్ దయచేసి రంగా గారి పేరు వాడి రాజకీయాలు చేయడం మానుకోవాలి అని హితవు పలికారు









