AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కేంద్ర కేబినెట్‌లో భారీ మార్పులు .. నేడు క్లారిటీ..

నేడు కేంద్ర కేబినెట్ కీలక భేటీ
మంత్రివర్గ విస్తరణపై చర్చించే అవకాశం
పలు రాష్ట్రాల పార్టీ అధ్యక్షులను మార్చి కొత్త నేతలను నియమిస్తూ కేంద్ర బీజేపీ నాయకత్వం ప్రకటన విడుదల చేసింది. ఈ పరిణామంతో కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఖాయమనే ప్రచారం మరింత ఊపందుకుంది. ఇందులో భాగంగా ఈ ఏడాది ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లోని ముఖ్య నేతలకు కేబినెట్‌లో బెర్త్‌లు కేటాయించే అవకాశం మెండుగా కనిపిస్తోంది. దీంతో తెలంగాణ నుంచి మోదీ కేబినెట్‌లో ఎవరికి అవకాశం దక్కుతుందనే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కేంద్రమంత్రి పదవుల రేసులో పలువురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించడంతో బండి సంజయ్‌ను ఖచ్చితంగా కేంద్ర కేబినెట్‌లోకి తీసుకుంటారని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. బండి సంజయ్‌ను తప్పించడం, కిషన్ రెడ్డికి అధ్యక్ష బాధ్యతలు కేటాయించిన తరుణంలో.. మంగళవారం కేంద్ర పార్టీ కార్యాలయంలో జేపీ నడ్డాను ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు కలవడం హాట్‌టాపిక్‌గా మారింది. దీంతో బాపూరావును కూడా కేబినెట్‌లోకి తీసుకునే అవకాశముందనే చర్చ తెరపైకి వచ్చింది. బాపూరావుకు కేంద్రమంత్రి దక్కుతుందనే చర్చ గతంలోనూ పలుమార్లు జరిగింది. ప్రస్తుతం బీజేపీలో జరుగుతున్న భారీ మార్పుల క్రమంలో బాపూరావును కేంద్రమంత్రిగా తీసుకునే అవకాశం లేకపోలేదనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇవాళ ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ జరగనుంది. ఈ భేటీ తర్వాత కేబినెట్‌లో భారీ మార్పులు జరగే ఛాన్స్ ఉంది. మరో ఏడాదిలో లోక్‌సభ ఎన్నికలు ఉన్న వేళ కొంతమందిని తప్పించి కొత్తవారికి తీసుకునే అవకాశముందని మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీంతో తెలంగాణ నుంచి ఎవరికి కేబినెట్ బెర్త్ దక్కుతుందనే దానిపై నేడు క్లారిటీ వచ్చే అవకాశముంది.

ANN TOP 10