వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో వెళ్లడం ఖాయమైనట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటన వేళ ఈ అంశం పైన స్పష్టత వచ్చినట్లు సమాచారం. ఆంధ్ర ప్రదేశ్ పై రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేస్తుందని రాహుల్ గాంధీ అన్నారు. అమరావతికి మద్దతుగా త్వరలోనే ప్రియాంక గాంధీ రానుందని రాహుల్ చెప్పారు. అలాగే స్టీల్ ప్లాంట్ విషయంలో కాంగ్రెస్ కార్యకర్తలు భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చిన విషయం విదితమే.
షర్మిల ఇప్పటికే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి శివ కుమార్ తో చర్చలు కొనసాగించారు. అన్న జగన్ మోహన్ రెడ్డి తో విభేదాలు వుండటం వలన వైఎస్సార్‌టీపీని తెలంగాణాలో స్థాపించినట్లు ప్రచారం సాగింది. రాహుల్ గాంధీ ఖమ్మం సభ ముగించుకుని తిరిగి వెళ్లే ప్రయాణంలో గన్నవరంలో కాంగ్రెస్ ముఖ్య నేతలతో భేటీ అయినట్లు సమాచారం. ఇందులో ఆంధ్ర ప్రదేశ్ రాజయకీయాలు గురించి చర్చించినట్లు వినికిడి. అదే సమయంలో షర్మిల కాంగ్రెస్ లోకివచ్చే విషయాన్ని కూడా చర్చించినట్లు కేవీపీ రామ చంద్ర రావు అన్నారు.









