

పనితీరులో అందరికీ ఆదర్శంగా ఉంటూనే.. తన వేషధారణ, కట్టుబొట్టుతో తెలంగాణకే కాకుండా దేశంలోని ఎందరో యువతులకు రోల్ మోడల్ గా నిలుస్తున్నారామె. స్మితా సభర్వాల్ పేరు చెప్పగానే గ్రామీణ తెలంగాణం.. కృతజ్ఞతాభిమానం చాటుకుంటుంది. రోడ్లు వేసి, నీళ్లు తెప్పించి, బస్ షెల్టర్లు కట్టించిన దొరసాని అంటూ గ్రామాల్లోని పెద్దవాళ్లు చేతులెత్తి మొక్కుతారు కూడా. అంతటి పేరు తెచ్చుకుని, రికార్డులు, అవార్డులు సాధించిన ఈ ఐఏఎస్ ఆఫీసర్ ఇప్పుడు వైవిధ్యాన్ని చూపుతున్నారు. వీకెండ్ వచ్చిందంటే చాలు ఏదో వెకేషన్‌కి వెళ్లిపోయి హాయిగా గడిపేస్తూ ఒత్తిడిని దూరం చేసుకుంటూ ఉంటారు. ఈసారి స్మితా సబర్వాల్ తన ఫ్యామిలీతో గోవా వెకేషన్‌కి వెళ్లారు. గోవా అందాలను ఆస్వాధిస్తూ.. ఆనందంగా గడిపిన క్షణాలను ఫొటోల రూపంలో సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్‌తో పంచుకున్నారు. మరి మీరూ చూసేయండి.
స్మిత సభర్వాల్ 2001 బ్యాచ్ కు చెందిన తెలంగాణ కేడర్ ఐఏఎస్ అధికారిణి. జనాల సమస్యలకు పక్కా ప్రణాళికతో పరిష్కారాలు చూపుతూ ఆమె People’s Officerగా పేరు తెచ్చుకున్నారు. , కలెక్టర్ గా తన కచ్చితమైన ప్రణాళికలు-పనితీరుతో ఆమె కేసీఆర్ దృష్టిలో పడ్డారు. అలా.. సీఎంఓలో నియమితులైన మొదటి మహిళా ఐఏఎస్‌గానూ స్మిత సభర్వాల్ రికార్డులకు ఎక్కారు. సీఎంఓ అడిషనల్ సెక్రటరీగా ఆమె విధుల్లో ఉన్నారు.












