AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సోలాపూర్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్‌

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మహారాష్ట్ర పర్యటనలో భాగంగా సోమవారం సాయంత్రం సోలాపూర్‌కు చేరుకున్నారు. రెండు రోజుల పర్యటన కోసం ఇవాళ ఉదయం హైదరాబాద్‌ నుంచి రోడ్డు మార్గంలో రెండు ప్రత్యేక బస్సులు, భారీ కార్ల కాన్వాయ్‌తో బయలుదేరి వెళ్లిన విషయం తెలిసిందే. మధ్యాహ్నం ధారాశివ్‌ జిల్లా ఒమర్గాలో మధ్యాహ్నం భోజనం చేశారు. ఆ తర్వాత సాయంత్రం సోలాపూర్‌కు చేరగా.. ముఖ్యమంత్రికి బీఆర్‌ఎస్‌ నేతలు ఘన స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్‌ రాత్రి సోలాపూర్‌లోనే బస చేయనున్నారు.

ANN TOP 10