AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీఆర్‌ఎస్‌ పార్టీని బొందపెడితేనే అభివృద్ధి

మోసపూరిత వాగ్ధానాలతో కేసీఆర్‌ పాలన
పేదలకు అందని సంక్షేమ ఫలాలు
కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస్‌ రెడ్డి ఫైర్‌
పల్లె పల్లెకు కంది శ్రీనన్న కార్యక్రమంతో కార్యకర్తల్లో జోష్‌

ఆదిలాబాద్‌: గడప గడపకు కాంగ్రెస్‌ – పల్లె పల్లెకు కంది శ్రీనన్న కార్యక్రమం కాంగ్రెస్‌ కార్యకర్తల్లో జోష్‌ నింపుతోంది. కార్యక్రమంలో భాగంగా ఆదివారం భాగంగా బేలా మండలం మంగ్రూడ్‌ గ్రామంలో పార్టీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస్‌ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు,కాంగ్రెస్‌ శ్రేణులు, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస రెడ్డిని డప్పు చప్పులతో ఘనస్వాగతం పలికారు. అనంతరం బాజీ రావు బాబా గారి ఆలయాన్ని సందర్శించి ఆశీస్సులు తీసుకొని గడప గడపకి వెళ్తు కాంగ్రెస్‌ పార్టీ గ్యారంటీ హామీలు గురించి కరపత్రాలతో ప్రజలకు వివరించిన కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస రెడ్డి గారు మాట్లాడుతూ ఈ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను అన్యాయాలను గురించి ప్రజలకు తెలిపారు.

లక్ష రూపాయల రుణమాఫీ, రైతు బంధు, పొడుభూములకి పట్టాలు, రేషన్‌ కార్డులు, పింఛన్లు, డబల్‌ బెడ్రూం లు ఏ ఒక్క సంక్షేమ పథకలు అందించలేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే 2 లక్షల రుణమాఫీ,15 వేల రైతు బంధు,రైతు భీమా,పొడుభూములకు పట్టాలు, స్కాలర్షిప్‌ లు, రేషన్‌ కార్డులు, 5 వేల రూపాయల పింఛన్లు, నిరుద్యోగ భృతి,ఇల్లులు కట్టిస్తదని, 18 సంవత్సరాలు నిండిన అడ బిడ్డకు ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఇస్తుంది అన్ని సంక్షేమ పథకాలు అందుతాయి అని తెలిపారు.

పార్టీ కోసం క్షేత్ర స్థాయిలో పని చేయాలనీ కార్యకర్తలు కోరారు. కార్యక్రమంలో గీమ్మ సంతోష్‌, నాగర్కర్‌ శంకర్‌, మాజీ ఎంపీటీసీ రెంజర్ల రాజన్న, లక్ష్మిపూర్‌ గ్రామ ఎంపీటీసీ మనోజ్‌, అల్లూరి అశోక్‌ రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ బేలా మండలం ప్రెసిడెంట్‌ ఫైజుల్లా ఖాన్‌, బేలా మండలం మాజీ మార్కెట్‌ చైర్మయిన్‌ వామన్‌ వంకాడే, బేలా మండలం ఎస్‌. టి సెల్‌ చైర్మయిన్‌ మాడవి చంద్రకాంత్‌, దీపక్‌ రావు, చిత్రు, భీమ్‌ రావు పటేల్‌, ఓసావర్‌ సురేష్‌, శంకర్‌, ప్రభాకర్‌ రావు, గేడం అశోక్‌, రామ్‌ రెడ్డి, షేక్‌ షాహిద్‌, తాడ్సే భాస్కర్‌, గణేష్‌, దత్తజీ చౌహన్‌, గులాబ్‌ చౌహన్‌,వినోద్‌, మంగేష్‌, చంద్రకాంత్‌ వంకాడే, టెకం గణేష్‌ షేక్‌ సైఫ్‌ హుస్సేన్‌,పలువురు కాంగ్రెస్‌ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

ANN TOP 10