జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై ఆయన కూతురు తుల్జా భవానీ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. తన తండ్రి ప్రభుత్వ భూమిని కబ్జా చేసి తన పేరున రిజిస్ట్రేషన్ చేశారనీ.. ఆ భూమి తనకు వద్దని ఆమె తెలిపారు. ఆ భూమిని తిరిగి చేర్యాల మున్సిపాలిటీకీ, చేర్యాల ఆస్పత్రికి రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు తెలిపిన ఆమె… కబ్జా భూమి చుట్టూ తండ్రి కట్టించిన గోడను ఆమె కూల్చేశారు.
తన తండ్రి చేసిన తప్పుకి చేర్యాల ప్రజలు తనను క్షమించాలన్న ఆమె… తన తండ్రి ఎమ్మెల్యే కాకముందే రూ.1000 కోట్లు సంపాదించారనీ… 70 ఏళ్ల వయసున్న ఆయన ఇప్పుడు ఇలా చెయ్యడం కరెక్టు కాదని ఆమె అన్నారు. మరి ఈ ఘటనపై ముత్తిరెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి.









