AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

శ్రీవాణి ట్రస్టు నిధులపై టీటీడీ క్లారిటీ.. శ్వేతపత్రం విడుదల

తిరుమల శ్రీవాణి ట్రస్ట్‌పై శ్వేతపత్రం విడుదల చేసింది టీటీడీ. దళారీ వ్యవస్థను రూపు మాపేందుకు శ్రీవాణి ట్రస్ట్ ఏర్పాటు చేశామన్నారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. మొత్తం 70మంది దళారులను పట్టుకున్నామని.. మరో 214 కేసులు నమోదు చేశామన్నారు. స్వామివారికి విరాళం ఇస్తే రాజమార్గం ద్వారా దర్శనం ఏర్పాటు చేయాలనీ టీటీడీ భావించిందన్నారు.

టీటీడీ పాలకమండలిలో చర్చించి.. భక్తుల అభిప్రాయం తెలుసుకొని శ్రీవాణిని ప్రారంభించామన్నారు. 2019 సెప్టెంబర్ 23 నాడు శ్రీవెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్ ప్రివిలేజ్ బ్రేక్ దర్శనం ఇవ్వడం జరిగిందన్నారు. రూ.10 వేల రూపాయలు చెల్లించిన భక్తుడికి శ్రీవారి దర్శన సదుపాయం కల్పించామన్నారు. శ్రీవాణి ద్వారా వచ్చే నగదు వివిధ బ్యాంకులలో ఫిక్సెడ్ డిపాజిట్స్ చేస్తున్నామని.. మొదట డొనేషన్ కు రూ. 10 వేలకు, రెండవది దర్శనం కోసం రూ.500 కు రసీదు ఇస్తున్నామన్నారు. వివిధ పార్టీలు చేస్తున్న ఆరోపణలు అవాస్తమని.. భక్తుడు చెల్లిస్తున్న ప్రతి రూపాయికి రసీదు ఇస్తున్నామన్నారు.

మే 31 2023 వరకు రూ. 861 కోట్లు శ్రీవాణి ట్రస్టుకు భక్తులు విరాళం అందించారన్నారు. రూ. 602 కోట్ల రూపాయలు ఫిక్స్‌డ్ డిపాజిట్స్ వేశామని.. రూ. 120 కోట్ల రూపాయలను వివిధ కార్యక్రమాలకు వినియోగించామన్నారు. శ్రీవాణి ట్రస్ట్ ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు మాత్రమే వినియోగిస్తున్నామని.. వివిధ రాష్ట్రాల్లో సుమారుగా 127 ప్రాచీన ఆలయాలు పునఃనిర్మాణానికి ఖర్చుపెట్టామన్నారు.

ఇందులో కొన్ని పూర్తి చేశామని.. మరికొన్ని చివరి దశకు చేరుకుందన్నారు. సేవింగ్స్ ఖాతాలో 139 కోట్ల నిధులు ఉన్నాయని.. శ్రీవాణి ట్రస్టు నిధుల డిపాజిట్లు ద్వారా 36.50 కోట్ల వడ్డీ వచ్చిందన్నారు. ఇప్పటి వరకు 8లక్షల మందికీ పైగా భక్తులు శ్రీవాణి ట్రస్టు ద్వారా స్వామి వారిని దర్శించుకున్నారన్నారు. భక్తులు ఎవరు టీటీడీపై ఆరోపణలు చెయ్యలేదని.. శ్రీవాణి ట్రస్టు ద్వారా దర్శనానికి వెళితే రసీదులు ఇవ్వలేదంటూ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ టీటీడీపై ఆరోపణలు చేశారన్నారు. ఆయన ఎప్పుడు దర్శనానికి వచ్చారో చెబితే పరిశీలించి రసీదులు ఇస్తామన్నారు. ఆధారాలు లేకుండా రాజకీయ పరంగా నిరాధారమైన ఆరోపణలు చెయ్యడం తగదని.. భక్తుల మనోభావాలు దెబ్బతిన్నెలా ఆరోపణలు చేస్తే చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ANN TOP 10