నేడు ఏపీ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల కానున్నాయి. విద్యార్థులు www.bse.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఫలితాలను పొందవచ్చు. పాఠశాల లాగ్‌ఇన్‌లో సంబంధిత విద్యా సంస్థకు చెందిన విద్యార్థుల ఫలితాలు ఉంటాయని, మార్కుల జాబితాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానందరెడ్డి తెలిపారు. ఈ పరీక్షలు 1.87 లక్షల మంది రాశారు.









