AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నేడు మీడియా ముందుకు రాంచరణ్-ఉపాసన

ఇటీవల తల్లిదండ్రులైన మెగా పవర్ స్టార్ రాంచరణ్-ఉపాసన దంపతులు ఈ మధ్యాహ్నం మీడియా ముందుకు రానున్నారు. ఈ నెల 20న ఉపాసన పండంటి పాపకు జన్మనిచ్చిన ఉపాసన నేడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్నారు. తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి బయటకు వచ్చిన తర్వాత మధ్యాహ్నం 1.30 గంటలకు రాంచరణ్ దంపతులు అపోలో ఆస్పత్రి వద్దనున్న నాగమ్మ ఆలయం వద్ద మీడియాతో మాట్లాడనున్నారు. ఈ సందర్భంగా తమకు శుభాకాంక్షలు చెప్పిన వారందరికీ వారు కృతజ్ఞతలు తెలపనున్నారు. కాగా, మీడియా సమావేశంలో పాప ఫొటోలు విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం.

ANN TOP 10