బంగారం కొనాలనుకునే వారికి ఇది పండగ లాంటి వార్తే. నిన్న స్థిరంగా ఉన్న బంగారం, వెండి ధరలు నేడు దిగి వచ్చాయి. హైదరాబాద్ లో 22 తులాల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.200 మేర తగ్గి రూ. 54,500 ఉండగా.. 24 తులాల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.220 మేర తగ్గి రూ. 59,450కి చేరుకుంది. ఇక వెండి విషయానికి వస్తే.. కిలోపై రూ.1000 తగ్గి రూ.72,000కు చేరుకుంది.









