AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అమిత్‌ షా తెలంగాణ పర్యటన రద్దు !

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా తెలంగాణ పర్యటన రద్దు అయ్యింది. బిపర్‌జాయ్‌ తుపాను కారణంగా పరిస్థితులను దగ్గరుండి సమీక్షించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఆయన తన పర్యటన రద్దు చేసుకున్నట్లు కేంద్ర హోం శాఖ సమాచారం అందించింది. దీంతో ఖమ్మం సభ ఏర్పాట్లను బీజేపీ శ్రేణులు నిలిపివేశారు!. షెడ్యూల్ ప్రకారం బుధవారం రాత్రే అమిత్ షా హైదరాబాద్ చేరుకోవాల్సి ఉన్నప్పటికీ బిపర్‌జోయ్‌ తుఫాను కారణంగా పర్యటన రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.

బిపర్‌జోయ్‌ తుఫాన్ ప్రధానంగా గుజరాత్‌పై తీవ్రమైన ప్రభావం చూపుతుందనే అంచనాల నేపథ్యంలో ప్రధాని మోదీ (PM MODI), హోంమంత్రి అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.

ANN TOP 10