AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రైతుకు బేడీలు వేసే సర్కార్ ఇది.. షర్మిల

ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ మార్పుపై ఆందోళన చేసిన యాదాద్రి జిల్లా రాయగిరి రైతులను పోలీసులు సంకెళ్లు వేసి కోర్టుకు తీసుకురావడంపై వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దొర పాలనలో న్యాయమడిగిన అన్నదాతకు తప్పని సంకెళ్లు అంటూ విరుచుకుపడ్డారు. “ఆప్ కి బార్ కిసాన్ సర్కార్ ” అంటే ఇదేనా దొరగారు? అంటూ ప్రశ్నించారు. నమ్ముకున్న భూమిని ఇచ్చేది లేదంటే బేడీలు వేయడమా మీరిచ్చే భరోసా అని వైఎస్సార్టీపీ అధినేత్రి నిలదీశారు.

ట్వీట్టర్ వేదికగా స్పందిస్తూ… ‘‘మీ బందిపోట్లను ప్రశ్నిస్తే రైతు అని చూడకుండా జైలుకు పంపడమేనా మీ నినాదం ?. మద్దతు ధర అడిగితే సంకెళ్లు. పంట కొనండని అడిగితే సంకెళ్లు. భూములు పోయాయని అడిగితే సంకెళ్లు. భూములు ఇవ్వం అని చెప్పినా సంకెళ్లు. ఆక్రందన, ఆవేదన, ఆందోళన ఏది చూపినా రైతుకు దొర ఇచ్చే గిఫ్ట్ సంకెళ్లు. కిసాన్ బరోసా అని, వచ్చేది రైతు ప్రభుత్వమని, చెప్పుకొనేందుకు సిగ్గుపడు దొర సిగ్గుపడు. మీది భరోసానిచ్చే సర్కార్ కాదు. “రైతుకు బేడీలు వేసే సర్కార్”. రైతును బర్బాద్ చేసే సర్కార్. రారాజును తీవ్రవాదిగా చూసే సర్కార్. రైతులను ఉగ్రవాదుల్లా చిత్రీకరించి సంకెళ్లు వేసిన కేసీఆర్ ఒక తాలిబానా’’ అంటూ ఆగ్రహం వ్యక్తం వేశారు.

ANN TOP 10