తెలంగాణలో ఈడీ దాడులు సంచలనం రేపుతున్నాయి. ప్రజాప్రతినిధుల ఇళ్లపై మెరుపు దాడులు చేస్తూనే మరోవైపు అరెస్టులు చేస్తున్నారు ఈడీ అధికారులు. బుధవారం తెలంగాణలో ప్రముఖ వ్యాపారవేత్తతో పాటు ఇంగ్లీష్ పేపర్ డెక్కన్ క్రానికల్ చైర్మెన్ వెంకట్రామి రెడ్డిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. మనీ లాండరింగ్ కేసులో విచారణకు పిలిపించిన ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. డీసీ చైర్మెన్ వెంకట్రామిరెడ్డిపై గతంలో రుణాలు ఎగవేసిన ఆరోపణలపై సీబీఐ కేసు నమోదు చేసింది. సీబీఐ కేసు ఆధారంగానే ఇప్పుడు ఈడీ దూకుడు పెంచింది. డీసీ చైర్మెన్ వెంకట్రామిరెడ్డితో పాటు మరో వ్యాపారవేత్త మణి అయ్యర్‌ను హవాలా, మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ చేసింది ఈడీ.
కేంద్ర దర్యాప్తు సంస్థలు దూకుడు పెంచాయి. తెలంగాణలో ప్రజాప్రతినిధులు, ప్రముఖుల ఇళ్లపై దాడులు జురుపుతూనే మరోవైపు అరెస్టుల పర్వానికి దిగుతున్నారు. తాజాగా డెక్కన్ క్రానికల్ చైర్మన్ వెంకట్రామిరెడ్డితో పాటు మణి అయ్యర్ అనే మరో బిజినెస్‌మెన్‌ని అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు. గతంలో వెంకట్రామిరెడ్డి వేర్వేరు బ్యాంకులు నుంచి 8800 కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నారు. వాటిని తిరిగి చెల్లించలేదనే ఆరోపణలపై గతంలో సీబీఐ కేసు నమోదు చేసింది. ఆకేసును ఆధారంగా చేసుకొని ఈడీ అధికారులు కేసు నమోదు చేసుకొని విచారణ మొదలుపెట్టింది. అందులో భాగంగానే వెంకట్రామిరెడ్డిని విచారణకు పిలిపించారు. విచారించిన అనంతరం వెంకట్రామిరెడ్డితో పాటు మణి అయ్యర్ అనే మరో ప్రముఖ వ్యక్తిని అరెస్ట్ చేసింది ఈడీ.









