AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నిమ్స్ దశాబ్ది బ్లాక్‌కు నేడు సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన

తెలంగాణ (Telangana)రాష్ట్ర ప్రభుత్వం మరో గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. దేశంలోనే ఎక్కడా లేనట్లుగా 4వేల పడకలతో అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రి (Hospital)బిల్డింగ్‌ని నిర్మిస్తోంది. తెలంగాణ వైద్య, ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్‌(Hyderabad) ఎర్రమంజిల్‌లోని 33ఎకరాల స్తలంలో నేడు ఈ ఆసుపత్రి భవనం శంకుస్థాపన చేయనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. 1570కోట్ల ఖర్చుతో సుమారు 34విభాగాలు ఉండేలా అత్యాధునిక వైద్యసేవలందించాలని నిమ్స్‌కు అదనంగా ఈ ఆసుపత్రి నిలవనుంది. ఇందులో భాగంగానే నేడు కేసీఆర్(KCR)దశాబ్ధి బ్లాక్‌కు శంకుస్థాపన చేస్తారు. సుమారు 30నెలల్లో ఈ ఆసుపత్రి బిల్డింగ్‌ని పూర్తి చేసేందుకు తగిన ప్రణాళికలను కూడా సిద్దం చేసారు.

హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్‌లోని శిథిలావస్థకు చేరుకున్న ప్రభుత్వ క్వార్టర్లను కూల్చివేసి 25లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 2100పడకల ఆసుపత్రి భవనాన్ని నిర్మించడానికి రహదారులు, భవనాల శాఖ పక్కా ప్రణాళికను రూపొందించింది. 2014 ముందు వరకు నిమ్స్‌ ఆసుపత్రి అరకొర వసతులు, చాలి చాలని వైద్య పరికరాలతో ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉండేవారు. బీఆర్ఎస్ పాలనలో 2014 నుంచి 2021 వరకు సుమారు 90కోట్ల రూపాయలతో ఎక్వీప్‌మెంట్స్ కొనుగోలు చేయడమే కాకుండా ..ఆసుపత్రిని ఆధునీకరించడం జరిగింది. దీనికి అనుబంధంగా ఈరోజు మరో 2100పడకల ఆసుపత్రి బిల్డింగ్ నిర్మాణానికి కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు.

ANN TOP 10