AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

గ్రూప్-1 పరీక్షకు తగ్గిన హాజరు.. పేపర్ మస్త్ టఫ్ అంటున్న అభ్యర్థులు..

తెలంగాణలో ఈ రోజు నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్షకు మొత్తం 3.80 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. 2.60 లక్షల మంది హాజరైనట్లు తెలుస్తోంది. సాయంత్రానికి అధికారులు ఖచ్చితమైన లెక్కలు విడుదల చేస్తారు. అక్టోబర్ 16న నిర్వహించి.. పేపర్ లీకేజీ కారణంగా రద్దు చేసిన పరీక్షకు మొత్తం 2.80 లక్షల మంది హాజరయ్యారు. దీంతో దాదాపు 20 వేల మంది గతంలో హాజరై.. ఇప్పుడు గైర్హాజరైనట్లు తెలుస్తోంది. ఇంకా పేపర్ విషయానికి వస్తే.. చాలా టఫ్ గా ఉందన్న అభిప్రాయం పలువురు అభ్యర్థుల నుంచి వ్యక్తం అవుతోంది. గత పేపర్ మాదిరిగానే ఉందని మరి కొంత మంది చెబుతున్నారు. ఇంకా.. ఈ సారి కటాఫ్ మార్కులు 70గా ఉండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరో 3 రోజుల్లో ప్రైమరీ కీని పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే.. గతంలో చోటు చేసుకున్న పేపర్ లీకేజీ తదితర పరిణామాల నేపథ్యంలో ఈ సారి పరీక్ష నిర్వహణకు టీఎస్పీఎస్సీ కఠిన చర్యలు చేపట్టింది. అనేక కొత్త రూల్స్ ను తీసుకువచ్చింది. పరీక్ష సమయానికి 15 నిమిషాల ముందే ఎగ్జామ్ సెంటర్ల గేట్లను మూసివేస్తామని స్పష్టం చేసింది. గేట్లు మూసిన తర్వాత ఎవరినీ లోనికి అనుమతించేది లేదని వెల్లడించింది. ఇంకా బూట్లు వేసుకుని రావొద్దని, చెప్పలతోనే అభ్యర్థులు పరీక్షకు హాజరుకావాలని సూచించింది.

ANN TOP 10