తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ప్రభుత్వం నిర్వహించిన చెరువు పండుగ కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి గంగుల కమలాకర్ నాటు పడవ ఎక్కే ప్రయత్నంలో చెరువులో పడిపోయారు. ఈ క్రమంలో ఒక్కసారిగా ఓ వైపు వంగిపోవడంతో పడవ బోల్తా పడింది. దీనితో పట్టు కోల్పోయిన మంత్రి నీళ్లలో పడిపోయారు.
వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ ఆయనను నీళ్లలో నుంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. గంగులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కరీంనగర్ రూరల్ మండలం అసిఫానగర్ ఊర చెరువు వద్ద చెరువు పండుగ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయనను పడవ ఎక్కాలని బీఆర్ఎస్ కార్యకర్తలు కోరారు. దీనితో ఆయన నాటు పడవ ఎక్కబోయారు. కానీ పడవ ఎక్కుతున్న క్రమంలో పడవ ఒకవైపు ఒరిగిపోయి బోల్తా పడింది. దీనితో గంగుల నీళ్లలో పడిపోగా సెక్యూరిటీ ఆయనను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.









