AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

జియాగూడలో బాలిక ఆత్మహత్య

గోషామహల్: చదువుతో పాటు ఆట పాటల్లో ఎంతో యాక్టివ్‌గా ఉండే ఇంటర్మీడియట్ విద్యనభ్యసిస్తున్న బాలిక అనుమానాస్పదంగా ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కుల్సుంపురా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

తీవ్ర కలకలం రేపిన ఈ ఘటన పై కుల్సుంపురా పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన సంబంధిత వివరాలు, ఇన్‌స్పెక్టర్ అశోక్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం. మెదక్ జిల్లాకు చెందిన రమాదేవి, శ్రీనివాస్ దంపతులు కొన్నేళ్లుగా జియాగూడ భరత్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. శ్రీనివాస్ వృత్తి రీత్యా వ్రైడర్. వీరికి ముగ్గురు కూతుళ్లు సంజన, నవ్య, దివ్యలు సంతానం. వీరిలో మొదటి కూతురు డిగ్రీ, రెండో కూతురు ఇంటర్మీడియట్, మూడో కూతురు పాఠశాల విద్యను అభ్యసిస్తున్నారు. అనుమానాస్పదంగా ఆత్మహత్యకు పాల్పడిన మృతురాలు నవ్య (17) బాగ్ లింగంపల్లిలోని అంబేద్కర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతుంది.

బుధవారం రాత్రి ఇంటి గ్రౌండ్ ఫ్లోర్‌లోని గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం అమావాస్య నుండి తమ ఇంటి ఎదుట గుర్తుతెలియని వ్యక్తులు నిమ్మకాయలు, కొబ్బరికాయలు, అగరుబత్తీలు, పసుపు, కుంకుమ వేసి క్షుద్ర పూజలు చే శారని, అందువల్లే తమ కూతురు మరణించిందని ఆరోపిస్తున్నారు.

ANN TOP 10