AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

దారుణం.. మహిళను ముక్కలు చేసి.. కుక్కర్‌లో ఉడికించి

శ్రద్ధావాకర్‌ హత్య కేసు దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఇంకా దానిని మర్చిపోకముందే అదే తరహాలో మహారాష్ట్ర రాజధాని ముంబయిలో మరోకేసు వెలుగుచూసింది. తన సహజీవన భాగస్వామిని హత్యచేసి, ఆమె శరీర భాగాలను ముక్కలుగా చేసిన వ్యక్తిని బుధవారం సాయంత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వెల్లడించిన వివరాలు ప్రకారం.. 56 ఏళ్ల వయస్సున్న మనోజ్‌ సహానీ.. సరస్వతి వైద్యతో మూడేళ్లుగా సహజీవనంలో ఉన్నారు.

వారిద్దరు ముంబయిలోని మీరా రోడ్డులోని ఓ ఇంటిలో అద్దెకు ఉంటున్నారు. అయితే నిన్న వారు ఉంటున్న ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోవడంతో సరస్వతి హత్య గురించి వెలుగులోకి వచ్చింది. ఆ ఇంట్లో మృతురాలి శరీర భాగాల ముక్కలను పోలీసులు గుర్తించారు. దాదాపు నాలుగు రోజుల క్రితమే ఆమె హత్య జరిగినట్లు వారు అంచనావేశారు. వారిద్దరి మధ్య జరిగిన గొడవే ఈ దారుణానికి కారణమై ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా వెల్లడించారు. ఈ హత్యను దాచిపెట్టేందుకు అతడు యత్నించాడని తెలిపారు. ఆమె శరీర భాగాల్లో కొన్నింటిని నిందితుడు కుక్కర్‌లో ఉడికించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యకు గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించినట్లు వెల్లడించారు.

ANN TOP 10