AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కమలమా?… కాంగ్రెస్సా?

అంతర్మథనంలో జితేందర్‌ రెడ్డి, డీకే అరుణ
రాష్ట్రంలో బీజేపీ దూకుడుకు కర్ణాటక ఫలితాలు కళ్లెం వేసినట్లైంది. అక్కడ అధికారంలోకి వస్తే ఇక్కడ అధికారం చేజిక్కించుకోవచ్చుననుకున్న కమలం నేతల ఆశలు అడియాశలయ్యాయి. కర్ణాటక ఫలితాలు కాంగ్రెస్‌కు ఆక్సీజన్‌ అందించగా బీజేపీని వెంటలేటరపై ఉంచాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. కర్ణాటకలో ఖంగుతినడంతో ఇక్కడి బీజేపీ అగ్ర నేతల్లో అంతర్మథóనం మొదలైంది. ఇక్కడ తమ రాజకీయ భవిష్యత్తు ఏమిటన్న డిఫెన్స్‌లో పడిపోయారు. ఇటు కార్యకర్తల్లో సైతం నైరాశ్యం మొదలైంది.

బీజేపీలో సీనియర్‌ నేతలు జితేందర్‌ రెడ్డి, డీకే అరుణ సైతం అంతర్మథనంలో పడ్డట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మహబూబ్‌నగర్‌ ఉమ్మడి జిల్లాలో పార్టీ సీనియర్‌ నేతలుగా ఉంటున్న డీకే అరుణ, జితేందర్‌ రెడ్డిల రాజకీయ భవిష్యత్‌ ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. పోటీ బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్యనే ఉండవచ్చునని సర్వేలు చెబుతుండడంతో తాము కమలంలోనే ఉండాలా ? లేక కాంగ్రెస్‌ గూటికి చేరుదామా అన్న మేధోమధనం చేస్తున్నట్లు సమాచారం. డీకే అరుణ బీజేపీిలో జాతీయ ఉపాధ్యక్షురాలిగా కీలక పోస్టులో కొనసాగుతున్నారు. మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి జాతీయ కార్యవర్గ స భ్యులుగా ఉంటున్నారు. వీరిద్దరూ బీజేపీలో చక్రం తిప్పే సత్తా ఉన్న నేతలే. అయినప్పటికీ మారిన రా జకీయ పరిస్థితుల నేపథ్యంలో వీరి రాజకీయ పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని సన్నిహిత వర్గాల భొగట్టా. వీరిద్దరు కూడా హుజురాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ వైపు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం.

ఒక వేళ్ల ఈటల పార్టీ మారితే వీరిద్దరు కూడా పార్టీ మారే పరిస్థితులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈటల నిర్ణయాన్ని బట్టే వీరి రాజకీయ భవిష్యత్‌ ఉంటుందని చర్చ జరుగుతోంది. ఈటలకు బీజేపీ సారధ్యం ఇస్తే వీరిద్దరు కమలంలోనే ఉండే అవకాశాలు ఉన్నాయని, లేక పోతే కాంగ్రెస్‌ వైపు చూసే అవకాశాలు లేక పోలేదనే రాజకీయ చర్చ జరుగుతోంది. ప్రస్తుతం పాలమూరు బీజేపీలో వీరిద్దరు చాలా స్ట్రాంగ్‌ నేతలుగా ఉంటూ వస్తున్నారు. డీకే అరుణకు గద్వాల్లో పెద్ద ఎత్తున అనుచర వర్గం ఉంది. మైనార్టీ వర్గం కూడా ఈమె కు అనుకూలంగానే ఉంటున్నారు. అయితే ఆమె బీజేపీలో ఉండడంతో మైనార్టీ వర్గం బిఆర్‌ఎస్‌ వైపు వెళ్లే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో డికె అరుణ సొంత గూడు కాంగ్రెస్‌లోకి చేరితే కొంత కలిసి రావచ్చునని చర్చించుకుంటున్నారు.

ANN TOP 10