AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కారుపై ట్రక్కు బోల్తా: ఏడుగురి మృతి

మధ్యప్రదేశ్‌లోని సిద్ధి జిల్లాలో గురువారం రహదారిపై వెళుతున్న ఒక స్పోర్ట్ యుటిలిటీ వెహికల్(ఎస్‌యువి)పై ఎదురుగా వస్తున్న డంపర్ ట్రక్కు బోల్తా పడడంతో ఏడుగురు వ్యక్తులు మరణించారు.
దోల్ గ్రామ సమీపంలోని సిద్ధి-తికరి రహదారిపై గురువారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు ఎస్‌పి రవీంద్ర సింగ్ తెలిపారు. మొదట ఎస్‌యువిని ఢీకొట్టిన డంపర్ ట్రక్కు ఆ తర్వాత దానిపై బోల్తాపడిందని ఆయన చెప్పారు. ఎస్‌యువిలోని ఏడుతురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించినట్లు ఆయన తెలిపారు. ప్రమాద స్థలానికి పోలీసు బృందాలు హుటాహుటిన తరలి వెళ్లి సహాయక చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. పూర్తి వివరాలు తెలియరావలసి ఉంది.

ANN TOP 10